గ్యాంగ్ స్టర్ నయీం మరణాంతరం ఆయనకు సంబంధించిన ఒక్కొక్క నిజాలు భయటపడుతున్నాయి. చాలామంది నయీం తమకు చేసిన అన్యాయాల గురించి పోలీసులకు పిర్యాదు అవుతున్న సమయంలో….. నయీం భువనగిరికి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించిన ఫోన్ కాల్ రికార్డ్ బయటికొచ్చింది. ఈ ఫోన్ కాల్ ప్రకారం ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన నయీం….తనకు సాయంత్రంలోగా డబ్బులివ్వాలని సదరు వ్యాపారవేత్తను బెదిరించాడు…దానికి ఆ వ్యాపారవేత్త నెల రోజులు టైమ్ ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. నామీదే కేసు పెట్టాలని నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు….చూద్దాం ఎవరు ఖతం అవుతారో అంటూ వార్నింగ్ లు…నీ కొడుకుల్లో ఒకడు ఉండడు అంటూ బెదిరింపులు…ఇలా నయీం బెదిరించిన మాటలన్నీ ఈ ఫోన్ కాల్ లో రికార్డ్ అయ్యాయి. 10 నిమిషాలకు పైగా ఉన్న ఈ కాల్ లో మరిన్ని విషయాలున్నాయి..మీరే వినండి నయీం ఏం మాట్లాడాడో..
loading...