ఎత్తయిన పర్వతాలపై మాత్రమే పెరిగే సంజీవని మొక్క శాస్త్రీయ నామం సెలగినెల్లా బ్రైయాప్టెరిస్. తెలంగాణలో ఈ మొక్కను పిట్టకాలుగా పిలుస్తారట. ఇది రాళ్లపైన మొలుస్తుంది. 6, 7 నెలల పాటు నీరు లేకున్నా ఈ మొక్క బతికేయగలదు. అయితే ఈ మొక్కకు పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనల్లో తెలిసింది. తీవ్రమైన గాయాలకు, వడదెబ్బకు, దెబ్బ తిన్న కణజాలాన్ని మళ్లీ బాగు చేసేందుకు, జీవక్రియలను సక్రమంగా నడిపించేందుకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని మళ్లీ మామూలు స్థితికి రప్పించేందుకు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, వాంతులు, రక్త సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నల్లమల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలు నీరసాన్ని పోగొట్టుకోవడానికి, బలాన్ని తెచ్చుకునేందుకు ఈ మొక్క ఆకుల రసంతో చేసిన ఓ ద్రవాన్ని నిత్యం తాగుతారట. మరణించబోతున్న లేదా మరణించిన వ్యక్తుల్లో ఉండే ఓ రకమైన వైరస్‌ను నాశనం చేసేందుకు అవసరమైన పలు హార్మోన్లను సంజీవని మొక్క స్రవిస్తుందట. ఈ క్రమంలోనే అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఈ మొక్క ద్వారా బతికేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట.