గ్రహాల్లో పెద్దదైన బృహస్పతి తన స్థానాన్ని 2016 సెప్టెంబరు 9 న మార్చుకోవడం వల్ల మిథున, తుల, కుంభ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. వచ్చే ఏడాది కొన్ని జన్మ రాశుల వారికి మాత్రమే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంత మంది ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు సరికదా దరిద్ర దేవత వెంటాడుతూ ఉంటుంది.జ్యోతిషులు జన్మ రాశుల ప్రకారమే భవిష్యత్తులో అదృష్ట, దురదృష్టాలను గ్రహస్థితుల బట్టి లెక్కిస్తారు. గ్రహాల సంచారాన్ని బట్టి వీటిని అంచనా వేయడం సులభమని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది.
బృహస్పతి అనుకూలమైన గ్రహామే కాదు. ఆలోచనలపై కూడా ప్రభావం చూపుతుంది. గురు సంచారం వల్ల అంతగా విజయావకాశాలు లేని పనులు కూడా పూర్తవుతాయి. విధ్వంసమైన, దుష్ట గ్రహాంగానూ శనిని పేర్కొంటారు. ప్రతి పనిలోనూ ఇది ఆటంకాలు కలిగిస్తుంది. 2017లో ఏ ఏ రాశుల వారు అనుకూల, ప్రతికూల ఫలితాలను పొందుతారో, ఎవరు కఠిన పరీక్షలను ఎదుర్కొంటారు తెలుసుకోండి.
హిందూ జ్యోతిశాస్త్రం ప్రకారం 2017లో తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనస్సు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇవి మీ జన్మ రాశులతై నిశ్చింతగా ఉండవచ్చు. వృత్తి పరంగానూ, ఆరోగ్య పరంగానూ, వైవాహిక పరంగానూ లాభదాయకంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. మీరు గుడ్డిగా తీసుకున్న నిర్ణయాలు నష్టాల కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు పుష్కలంగా వస్తాయి. అలాగే ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా సక్రమంగా ఉన్నా తెలివితక్కువ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది.