బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుకు అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది.
అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం..
loading...