News and Entertainment

అల్లు అర్జున్‌ బలుపుకు ఇదే నిదర్శణం.. మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం


అల్లు అర్జున్‌ ప్రస్తుతం వరుగా విజయాలు సాధిస్తూ మెగా హీరోల్లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈమద్య కాలంలో అత్యధిక సక్సెస్‌లను పొందిన హీరోగా అల్లు అర్జున్‌ పేరు దక్కించుకున్నాడు. ఈ సమయంలోనే అల్లు అర్జున్‌ కాస్త అతిగా ప్రవర్తిస్తున్నాడు.
రామ్‌ చరణ్‌ను తక్కువగా చేస్తూ మాట్లాడటం, పవన్‌ కళ్యాణ్‌ గురించి వింత కామెంట్స్‌ చేస్తూ ఉన్నాడు. అయితే పైకి చూడ మాత్రం రామ్‌ చరణ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. రామ్‌ చరణ్‌పై పైచేయి సాధించేందుకు అల్లు అర్జున్‌ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా రామ్‌ చరణ్‌పై పోటీకి అల్లు అర్జున్‌ సిద్దం అయ్యాడు.
ఇప్పటి వరకు పరోక్షంగానే రామ్‌ చరణ్‌కు సవాలు విసిరిన అల్లు అర్జున్‌ ఈసారి సంక్రాంతి రేసులో నిలిచి చరణ్‌కు పోటీని ఇవ్వబోతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘నాపేరు సూర్య’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.
సంక్రాంతికి చరణ్‌ రంగస్థలం చిత్రం విడుదల కాబోతుంది. అయినా కూడా అల్లు హీరో ఆగకుండా సంక్రాంతికే విడుదల కావాలని పట్టుబడుతున్నాడు. దాంతో సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అలా చేస్తే రామ్‌ చరణ్‌ సినిమాకు దెబ్బ పడ్డట్లే అనే చర్చ జరుగుతుంది. ఈ కారణంగా మెగా ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.