
రెండు నెలల ముందు కత్తి మహేష్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వారు వందల్లో ఉండేవారు. ఆయన ఒక సినీ విశ్లేషకుడు, రివ్యూలు రాస్తూ ఉంటాడు, సినిమాలపై తన అభిప్రాయాలను చెబుతూ ఉంటాడు అని చాలా మందికి తెలియదు. స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోతో కత్తి మహేష్ ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఆయన పాపులారిటీ వందల నుండి వేలకు వెళ్లింది. వేల సంఖ్యలో జనాలు ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిని క్రిటిక్ కత్తి మహేష్ పై దాడి చేస్తున్న విషయం తెలిసినదే.. ఏ అజెండా లేకుండా కేవలం ట్వీట్స్ మాత్రమే చేస్తూ వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎలా పోటీచేస్తారు అంటూ పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరిపై మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకం చూస్తే తనకు అసలు పవన్ తీరు ఏంటా అని ఆలోచనలో పడిపోయినట్లు తెలిపారు