రోజు రోజుకి మన లైఫ్ టైం తగ్గిపోతూ వుంది , దీనికి ముఖ్యమయిన కారణాలు ఎన్నో
వున్నా …మనం రోజూ తీసుకొనే ఆహారమే ఇందకు కారణమని అందరికి తెలుసు … కానీ మారలేకున్నారు
… ఈ పోస్ట్ లో చద్ది అన్నం గురించి చూద్దాం …
మన పెద్దవారు అన్ని సంవస్తరాలు ఏ రోగం లేకుండా దృడంగా ఉండటానికి కారణం
వారు రోజువారీ ఆహారపు అలవాట్లే …ఉదయాన్నే వారు ఇప్పటిలా దోస , ఇడ్లీ కాకుండా …చద్ది
అన్నం …అదే రాత్రి మిగిలిన అన్నము లో పెరుగో లేదా గంజి లో ఉప్పు వేసుకొని తినేస్తుంటారు
… అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట .
రాత్రి మిగిలిన అన్నం లో ఉదయానికల్లా
చాలా రకాల మార్పులు జరుగుతాయి, 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే
1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం
మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా
ఉంచడానికి ఉపయోగపడుతాయి.
చద్దన్నం ఉదయం తినడం వల్ల కలిగే ఉపయోగాలు:
- శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
- శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు,
పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
- ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే
తినాల్సిందే.
- పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుంది.
- పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం
తగ్గిస్తుంది.
- మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.