ఎలా అంటే.. బంగాళదుంపలు మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. బంగాళాదుంప ముక్కను ప్రతి రోజూ రెండు సార్లు చంకలు, గజ్జల్లో 20 నిమిషాల పాటు రుద్దుకుని తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచిది.దోసకాయలో కూడా మంచి బ్లీచింగ్ కంటెంట్ ఉంటుంది.
30 నిమిషాల పాటు దోసకాయ ముక్కను నల్లగా ఉన్న చర్మంపై రుద్ది నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచిది.
నిమ్మకాయలో కూడా బ్లీచింగ్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు మంచి యాంటిబ్యాక్టీరియా కూడా.. నల్లని చర్మంపై నిమ్మకాయ చీలికను ఓ 10 నిమిషాల పాటు రుద్ది నీటితో కడిగేయాలి.
ఆ..తర్వాత మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. బేకింగ్ సోడాని నీటితో కలిపి ప్లేస్టులా తయారు చేసి, దాన్ని నల్లగా ఉన్న చంకల్లో అప్లై చేయాలి. ఎండిపోయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఓ రెండు మూడు సార్లు చేస్తే, మచ్చలు పోతాయి.
కమలాపండు తొక్కు కూడా మచ్చలను మటుమాయం చేస్తుంది. ఎలా అంటే.. ముందుగా.. కమలాపండు తొక్కలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఆ..తర్వాత వాటిని మిక్సిలో వేసి పౌడర్ చేయాలి. రెండు టీస్పూన్ల ఆరెంజ్ పౌడర్ ని రోజ్ వాటర్ లో కాని పాలలో కాని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
ఆ..మిశ్రమాన్ని చంకల్లో నల్లగా ఉన్నచోట రాసి 15 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మచ్చలు తొలిగిపోతాయ్.
మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం @trendiworldofficial పేజీని లైక్ చేయండి
loading...