News and Entertainment

ఏసీ వ‌ల్ల ఆరోగ్యానికి న‌ష్టాలు ఇవే


ఆధునిక ప్ర‌పంచంలో అంద‌రూ స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతిని ఆస్వాదించ‌లేక‌పోతున్నార‌నే చెప్పాలి.దీనికితోడు అన్నీ క‌లుషితం అవుతున్నాయి కాబ‌ట్టి ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో చాలా మంది యువతి, యువకులే కాకుండా పెద్దవారు కూడా కాసేపు రిలాక్స్ అయ్యేందుకు ఏసీల‌ను ఆశ్ర‌యించేస్తున్నారు.

చాలా మంది అసలు ఏసీ లేకుండా ఉండలేక‌పోతున్నారు. ఏసీలో కూర్చున్న మాత్రాన తాత్కాలిక ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు కాని అనేక అన‌ర్ధాల‌కు మూలంగా ప‌రిణ‌మిస్తుంది. అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అవేంటో మ‌నం కూడా ఓ ప‌రిశీలిద్దామా

శ్వాస సమస్యలు:
నిత్యం కారు డోర్స్ మూసి ఉన్న ఏసీల్లో గడపడం వల్ల అక్కడి సూక్ష్మజీవులు ఏటూ వెళ్లలేక అక్కడక్కడే తిరుగుతూ ఒకరినుంది మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి దీనివల్ల శ్వాస సంభంధమైన వ్యాధులు తెలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి మాములు వాతావరణంలో పదినిముషాలు గడపడం మంచిది.

  • చాలా మంది ఎక్కువ స‌మయం ఏసీ లోనే గడుపుతూ ఉంటారు. అలాంటి వారు బయట వేడిని ఎక్కువ సమయం తట్టుకోలేరు కాబట్టి వారికి వడదెబ్బ త‌గిలి అవ‌కాశం ఎక్కువగా ఉంటుంది.
  • ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి దానిలో తేమ వ‌ల్ల‌ చర్మం పొడి బారుతుంది. కాబ‌ట్టి అలాంటి లక్షణాలు ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడితే ఎలాంటి సమస్య త‌లెత్త‌దు.
  • చాలామంది ఎక్కువ సేపు ఏసీలో పనిచేయడం వ‌ల్ల ఏసీలో ఉండే చల్లడనం ఎక్కువగా మారి పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనెప్పి,అలసటగా ఉండడం జరుగుతుంది. ఎక్కువసేపు ఏసీలో ఉంటే చలి కారణంగా కండరాలకు తగిననత రక్త ప్రసరన జరగక అలసట చెందుతారు.
  • రక్తపోటు,ఆర్దరైటిస్న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్న వారికి సమస్య తీవ్రతరం అవుతుంది.