News and Entertainment

ఈ గుడిలో ప్రసాదంగా….బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు ఇస్తారు.!


దేవాల‌యానికి వెళ్ల‌గానే మ‌న‌సు ప్రశాంత‌గా మారుతుంది. భ‌క్తిభావంతో పుల‌కించి పోతుంది. ఇక పూజారి ఇచ్చే ప్ర‌సాదంతో నోరు కాస్త తియ్య‌బ‌డుతుంది. అదే పూజారి లడ్డునో, చక్కెర పొంగళినో, పులిహోరనో కాకుండా…. బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను ప్ర‌సాదంగా అందిస్తే….?  ఆశ్చ‌ర్య‌పోతున్నారా.! మీరు విన్న‌ది నిజ‌మే. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌త్లాం అనే న‌గ‌రంలో ఉన్న మ‌హ‌ల‌క్ష్మి దేవాల‌యాన్ని సందర్శించిన భక్తులకు ….బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా   ప్రసాదంగా ఇస్తున్నారట.!


దంతెరాస్ పండుగ‌ను పుర‌ష్క‌రించుకుని మ‌హ‌ల‌క్ష్మి దేవికి …చాలా మంది భక్తులు కిలోల చొప్పున బంగారం.. వెండి క‌డ్డీలు.. వేల కోట్ల రూపాయ‌లు కానుక‌గా స‌మ‌ర్పిస్తారంట! దంతెరాస్ నుండి దీపావళి వరకు ఈ ఆలయమంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుందట.!


భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను…..తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడం…ఈ ఆలయం ప్రత్యేకత. దంతేరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి…… బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పచిపెడుతుంటారు. ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు అలాగే తీసుకెళ్లి ఇంట్లో పూజ గ‌దిలో ఉంచుతారంట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌క‌ల క‌ష్టాలు తొల‌గి ధ‌న సంప‌ద‌లు ప్రాప్తిస్తాయ‌ని వారి నమ్మకం.