
ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల చుట్టూ తిరుగుతోంది. తమిళ బిగ్‌బాస్ షో మళ్లీ వివాదంలో నిలిచింది. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో పనిచేసిన ఇబ్రహీం షైక్ అనే వ్యక్తి మృతి చెందడం ద్వారా సినీ నటుడు లెజెండ్ కమల్ హాసన్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. బిగ్‌బాస్ హౌస్‌లో ప్లంబర్‌గా పనిచేసే ఇబ్రహీం షైక్ మెదడులో ఏర్పడిన రుగ్మత కారణంగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. ఆస్పత్రిలో అతనిని పరిశోధించిన వైద్యులు అతడు మరణించినట్లు ధ్రువీకరించారు.
ముంబైకి చెందిన ఇబ్రహీం షైక్.. బిగ్‌బాస్ హౌస్‌లో 30 రోజుల పాటు పనిచేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫోన్లకు అనుమతి లేని నేపథ్యంలో అతడు మెదడు రుగ్మతతో బాధపడ్డాడు. తోటివారితో ఆరోగ్యం బాగోలేదని కూడా చెప్పాడు. అతనిని తోటివారు ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే షైక్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇలాంటి బిగ్ బాస్ షో లపై నిషేధం విధించాలి అని చాలా మంది అనడం దానికి తోడు ఇలా ఇంటిలో నిర్బంధించి హెల్త్ బాలేకపోయిన ఇంట్లో వాళ్లకి సమాచారం ఇవ్వకుండా ప్రాణాలు తీస్తున్న షో అవసరమా అని చాలా మంది అనడం గమనార్హం. చూద్దాం దీనిపై ఎలా స్పందిస్తారో షో నిర్వాహకులు.