నేటి ఆధునిక ప్రపంచంలో ధనం విలువ ఎంత ఉందో అందరికీ తెలిసిందే. అది ఉంటేనే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఎంతో మంది జీవితాలకు అది అత్యంత ఆవశ్యకం. అయితే ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ ధనవంతులు కారు. దాదాపు అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కేవలం కొందరు మాత్రమే అనుకున్న విధంగా లక్ష్యాలను చేరుకుని ధనం సంపాదించడంలో సఫలీకృతులవుతున్నారు.
కానీ అధిక శాతం మంది ధనం సంపాదించడంలో వెనుకంజ వేస్తున్నారు. కొంత మందైతే ధనం సంపాదించినా దాన్ని ఏదో ఒక రూపంలో కోల్పోతున్నారు. అయితే మీకో విషయం తెలుసా? హిందూ శాస్త్రం ప్రకారం అసలు ఏ వ్యక్తికైనా సంపదలు సిద్ధించడం కోసం ఏ దేవున్ని, దేవతను పూజించాలో? ఇంకెవరు లక్ష్మీ దేవిని, శ్రీమహావిష్ణువు అవతావరం అయిన వెంకటేశ్వర స్వామిని అంటారా? అయితే అది కరెక్టే కానీ, వారు అలా సంపదలను అనుగ్రహించాలంటే నవగ్రహాల్లో ఓ గ్రహానికి మనం పూజలు చేయాల్సిందేనట. ఆ గ్రహాన్ని శాంత పరుస్తేనే మనకు సంపదలు కలుగుతాయట. అదే శుక్ర గ్రహం.