అయితే ఆత్మహత్యకు చాలా సందర్భల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా.. లవ్ లో ఫెయిల్ అయినా,.. ఇంట్లో పేరెంట్స్ తిట్టినా, స్కూల్ టీచర్ కొట్టినా.. చిన్నపాటి మనస్పర్దలు వచ్చినా.. తమ అందమైన జీవితానికి సెలవిస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచించినా, మనకు నచ్చినవాళ్లతో మాట్లాడినా.. ఈ ఆత్మహత్య ఆలోచనకు దూరం కావచ్చు. కానీ ఎవరితో మాట్లాడకుండా మనోవేదనకు గురై.. చివరకు ప్రాణాలనే తీసుకునే భయంకరమైన ఆలోచనకు పురుడుపోస్తున్నారు.
సూసైడ్ అనేది సహజ మరణం కాదు. మరణానికి ఇదో మార్గం. ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి బలవంతంగా తన మరణాన్ని కోరుకోవడం, తమ ప్రాణాలను తన చేతులతో తీసుకోవడం. ఉరి వేసుకోవడం, పాయిజన్ తీసుకోవడం, పురుగుల మందు వంటి రకరకాలుగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ఏమవుతుంది ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మలో ఎలాంటి మార్పులు వస్తాయి ? ఆత్మహత్య తర్వాత వాళ్ల ఆత్మ బతికే ఉంటుందా ? అసలు ఆత్మహత్య తర్వాత వాళ్లు స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారా ? వెళ్లరా ?