News and Entertainment

చనిపోయిన వారిని బ్రతికించే సంజీవిని-1


2009లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ స‌న్నిహితుడు బాల‌కృష్ణ‌ మ‌రికొంద‌రు ఆయుర్వేద వైద్యుల‌ను వెంట బెట్టుకుని ఉత్త‌రాఖండ్ రాష్ట్రం చ‌మోలీ జిల్లాలో ఉన్న ద్రోణ‌గిరి ప‌ర్వ‌తాల‌పై సంజీవ‌ని మొక్క కోసం అన్వేషించార‌ట‌. పురాణాల్లో హ‌నుమంతుడు ఈ ప‌ర్వ‌తాన్నే తీసుకెళ్లిన‌ట్టు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. కాగా ఆ ప‌ర్వ‌తంపై వెతికిన బాల‌కృష్ణ అత‌ని బృంద స‌భ్యుల‌కు సంజీవ‌ని దొర‌క‌లేదు కానీ దాని వ‌ర్గానికే చెందిన మ‌రో 2 మొక్క‌లు దొరికాయ‌ట‌. ఈ మొక్క‌ల‌తోపాటు మ‌న దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన సంజీవ‌ని లాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన మ‌రో 17 మొక్క‌ల‌పై బెంగుళూరు వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, ఉత్త‌ర కర్ణాట‌క‌లోని సిర్సి అట‌వీ క‌ళాశాల ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశార‌ట‌. ఈ క్ర‌మంలో వారికి ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు తెలిశాయ‌ట‌. ఆ మొక్క‌ల‌న్నింటికీ దాదాపు సంజీవ‌ని మొక్క‌కు ఉన్న ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ట‌. కానీ ఈ మొక్క‌ల‌కు ఉన్న ఔష‌ధ గుణాల వ‌ల్ల‌ వ్య‌క్తుల‌ను బ‌తికించ‌డం మాట ఏమో గానీ పైన చెప్పిన ఇత‌ర అనారోగ్యాల‌ను మాత్రం త‌గ్గించ‌వ‌చ్చ‌ట‌.

తాజాగా వృక్ష‌శాస్త్ర అధ్యాప‌కుడు స‌దాశివ‌య్య అలాంటి సంజీవ‌ని మొక్క‌ల‌ను గుర్తించే స‌రికి ఇప్పుడు ఆ మొక్క‌కు సంబంధించిన అంశం మ‌ళ్లీ తెర పైకి వ‌చ్చింది. త‌మ ప‌రిశోధ‌న‌ల‌కు మ‌రిన్ని నిధులు స‌మ‌కూరిస్తే సంజీవ‌ని మొక్క‌ల‌ను ఎక్క‌డ ఉన్నా క‌చ్చితంగా గుర్తిస్తామ‌ని స‌దాశివ‌య్య చెబుతుండ‌గా, పైన చెప్పిన ద్రోణ‌గిరి ప‌ర్వ‌తాల‌ను సంజీవ‌ని మొక్క కోసం జ‌ల్లెడ ప‌ట్టేందుకు త‌మ‌కు రూ.150 కోట్లు ఇవ్వాల‌ని ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆ ప‌ర్వ‌త శ్రేణుల‌లో సంజీవ‌ని మొక్క కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేష‌ణ సాగిస్తోంది. మ‌రి అంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ఆ మొక్క ఎలాగైనా దొరుకుతుందో, లేదో వేచి చూడాల్సి ఉంది.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...