ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. భార్య భర్తలు కలిసి ఈజీ మనీకోసం చేసిన మోసాలు చాలానే ఇప్పటి వరకు చూశాం. కాని తాజాగా తమిళనాడులో జరిగిన ఈ కొత్త తరహా మోసం వింటే షాక్ అవుతారు. పోలీసులు ఈ చిత్రమైన మోసం విని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జంటకు ఇలాంటి క్రియేటివ్ ఆలోచన ఎలా వచ్చిందా అని వారు జట్టు పీక్కుంటున్నారు. ఈజీ మనీ కోసం ఈ భార్య భర్తలు తమను తాము అన్నా చెల్లెలుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడ్డారు.
తమిళనాడు తిరుప్పూర్ జిల్లాకు చెందిన దీన దయాళన్, ప్రియదర్శినిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా విలాసవంతమైన జీవితం కోసం మోసాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఒక స్మార్ట్ ఐడియాను వేశారు. ప్రియదర్శిని ఫేస్‌బుక్ ద్వారా బాగా డబ్బున్న అమ్మాయిలను స్నేహితురాలిగా పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమెతో చాటింగ్ చేసి సన్నిహిత్యం పెంచుకుంటుంది. ఆ తర్వాత తన అన్నయ్య అంటూ దీనదయాళన్‌ను పరిచయం చేస్తుంది. ఈయన తనదైన శైలి ఆకర్షణ శక్తితో వారిని ఆకర్షిస్తాడు. ఎంతగా అంటే వారం పది రోజుల్లోనే బెడ్‌మీదకు వచ్చేటంతగా... బెడ్ మీదకు వచ్చాక ఆమె సర్వస్వం తీసేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అని నమ్మించి, డబ్బులు బంగారం పట్టుకు రమ్మని చెబుతాడు.
దీనదయాల్ చెప్పినట్లుగానే వారు డబ్బు, బంగారం తీసుకు వస్తారు. పెళ్లి చేసుకోకుండా ఆ డబ్బు, బంగారం తీసుకుని ఉడాయిస్తారు. ఇలాగే నేను మోసపోయాను అంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అన్నా చెల్లి కలిసి మోసం చేశారు అని ఫిర్యాదు ఇచ్చింది. విచారించిన పోలీసులు వారు అన్నా చెల్లెలు కాదు అని, భార్య భర్తలు అని తెలుసుకుని షాక్ అయ్యారు. వీరి బారిన 20 మంది అమ్మాయిలు పడ్డారు. దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం మరియు 10 లక్షల నగడు వీరు మోసగించి తీసుకున్నట్లుగా వెళ్లడి అయ్యింది. మోసాల్లో తెలివిని ప్రదర్శించే బదులు మంచి ఉద్యోగ సాధనకు తెలివి ఉపయోగిస్తే బాగుంటుంది కదా అని కొందరు అంటున్నారు. ఈ జంట ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది.