వృషభ రాశి :
వృషభ రాశి వారు స్నేహితుల్తో చాలా సరదాగా ఉంటారట. ఏదయినా విషయంలో నమ్మదగిన వ్యక్తులలో వీరు కూడా ఒకరు అంట . వీరు స్నేహితులకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా నిలుస్తారంట. అంతే కాకుండా వీరు ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటారు.
కర్కాటక రాశి:కర్కాటక రాశి వారు స్నేహితుల్తో చాల హుందాగా ఉంటారు..ఎలాంటి విషయాలు అయినా వారితో పంచుకుంటారు. వీరు స్నేహం అంటే ప్రాణం ఇస్తారు. వీరు స్నేహితుల్తో ఉంటె విజయాలను సాధిస్తారు.. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటారు. అంతే కాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువే, వారి ఆలోచనలతో ముందుకెళ్తారంట.
సింహ రాశి:సింహ రాశి వారు స్నేహం లో చాల గొప్ప వారు. వీరు స్నేహితుల్తో చాలా అన్యునయంగా ఉంటారు.. వీరు తమ స్నేహితుల విజయాలను తమ విజయాలుగా ఆనందిస్తారు. ఈ రాశి వారు స్నేహితుల మీద గొప్ప నమ్మకం ఉన్న వారు..
కన్య రాశి:కన్య రాశి వారు తమ స్నేహితుల మీద ఉన్న ప్రేమ మాటలో చెప్పరాదు.. వీరు స్నేహితులు ఏదయినా సమస్యలో ఉంటె ముందు ఉండి సమస్య పరిష్కారం అయేవరకు తోడు ఉంటారు..కానీ వీరు తమ స్నేహితులు ఎంత మంచి వారైనా, వారిని మోసం చేస్తే మాత్రం అస్సలే ఊరుకోరు.
తులా రాశి:తులా రాశి వారికీ స్నేహం అంటే చాల ఇష్టం.. వీరు ఎక్కువగా స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతారు ..అంతే కాకుండా తమ జీవితంలో ప్రతి విషయాన్ని వారు తమ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటారు. స్నేహితుల ఆలోచనలతో ముందుకెళ్తారు , జీవితంలో విజయం సాధిస్తారు.