News and Entertainment

Golconda Bonalu 2025: జూన్ 26 నుంచి హైదరాబాద్‌లో బోనాల సందడి షురూ పూర్తి తేదీలు, ప్రత్యేకతలు!

Golconda Bonala festivities begin in Hyderabad from June 26th, complete dates and specials!-Trendi World

 భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల సందడి మొదలైంది! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవాలు జూన్ 26, గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి(Sri Jagadambika Ammavari) సన్నిధిలో తొలి బోనం సమర్పణతో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు భక్తి పారవశ్యంతో హైదరాబాద్‌ను(Hyderabad) ముంచెత్తే ఈ బోనాల జాతర పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు(Dates), ప్రత్యేకతలు మీకోసం.

ఆషాఢ బోనాల షెడ్యూల్ 2025:

ఈ ఏడాది ఆషాఢ మాసం(Ashada Masam) జూన్ 26, గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి గురువారం, ఆదివారం రోజుల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

  • జూన్ 26 (గురువారం): తొలి బోనం - గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి(Sri Jagadambika Ammavariki)
  • జూన్ 29 (ఆదివారం): రెండో పూజ - విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మకు బోనం(Kanuka Durgamma Bonam)
  • జూలై 3 (గురువారం): మూడో పూజ - బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనం(Balkampet Ellama Bonam)
  • జూలై 4 (శుక్రవారం): నాలుగో బోనం - జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి(Jubilee Hills Peddhama Thalli) (శుక్రవారం పెద్దమ్మకు అత్యంత పవిత్రమైన రోజు)
  • జూలై 6 (ఆదివారం): నాలుగో పూజ
  • జూలై 10 (గురువారం): ఐదో పూజ - సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం(Sri Ujjain Mahakali Ammavari Bonam)
  • జూలై 13 (ఆదివారం): ఆరో పూజ - సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి(Sri Ujjain Mahakali Ammavari) భక్తులచే బోనాలు సమర్పణ
  • జూలై 15 (మంగళవారం): బంగారు బోనం - చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి( Sri Bagya Lakshmi Ammavari Bonam)
  • జూలై 17 (గురువారం): ఏడో పూజ - లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి(Sri Simhavahini Ammavaru) బంగారు బోనం
  • జూలై 20 (ఆదివారం): ఎనిమిదో పూజ - పాతబస్తీ బోనాలు(Old City)
  • జూలై 21 (సోమవారం): ఘటాల ఊరేగింపుతో ఉత్సవాల ముగింపు
  • జూలై 24 (గురువారం): తొమ్మిదవ పూజ

గోల్కొండ బోనాలతో ఆరంభం:

ఆషాఢ బోనాల జాతర సాంప్రదాయం ప్రకారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి(Golconda Jagadambika Ammavari) సమర్పించే మొదటి బంగారు బోనంతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు, చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటాయి. అక్కడ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషం.

సప్తమాతృకలకు బంగారు బోనాలు:

బోనాల ఉత్సవాల్లో భాగంగా సప్తమాతృకలకు బంగారు బోనాలు సమర్పిస్తారు. వీటిలో తొలి బోనం గోల్కొండ జగదాంబికకు, రెండో బోనం జూన్ 29న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు సమర్పించనున్నారు. జూలై 3న బల్కంపేట ఎల్లమ్మకు మూడో బంగారు బోనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బంగారు బోనం, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఐదో బంగారు బోనం, జూలై 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు:

ఈ ఏడాది బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.