కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ ఒక కూల్‌డ్రిరక్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేవాడు. కాని ఆ తర్వాత తర్వాత ఏ ఇతర బ్రాండ్స్‌కు ప్రచారం చేసింది లేదు. కోట్ల పారితోషికాలు కూడా వద్దనుకుని బ్రాండ్స్‌ను దూరం పెట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్దం అయ్యాడు.
అయితే ఈసారి ఒక కమర్షియల్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా కాకుండా ఒక ప్రభుత్వ పథకంకు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు ఒక పథకంను తీసుకు వచ్చింది.
ఆ పథకం పేరు జీవదాన్. ఈ పథకం ప్రారంభించి చాలా నెలలు అవుతుంది. కాని ప్రజల్లో మాత్రం పెద్దగా అవగాహణ రావడం లేదు. జీవదాన్ పథకం కింద ఎన్నో వందల రోగాలకు ఫ్రీగా చికిత్స అందిస్తున్నారు. కాని ప్రజల్లో అవగాణ లేకపోవడంతో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా వృదా అవుతుంది.
అందుకే ప్రముఖ స్టార్‌తో ఈ పథకంకు ప్రచారం చేయించాలని భావించారు. అందుకోసం తాజాగా పవన్‌తో ఆ విషయమై చర్చించడం జరిగింది. పవన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడు. చాలా రోజుల తర్వాత పవన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్న నేపథ్యంలో జీవదాన్‌కు మంచి ప్రచారం లభించే అవకాశం ఉంది.