శివరాత్రి సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులను ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసేందుకు రాజమౌళిలో వేసిన ‘బాహుబలి’ సెట్టింగ్‌కు వెళ్లింది. అక్కడ సుమ సరదాగా తన సెల్‌లో ఫొటోలు తీసుకోవడంతో పాటు, సెల్ఫీలు తీసుకుంటుండటంతో ఆమెను బందీకానలో వేశారు. అనుష్కను బంధించిన ఆ సెల్‌లోనే ఆమెను బంధించాడు రాజమౌళి. సరదాగా చేసిన ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. రాజమౌళిని సుమ ఆ సెల్‌లో ఉండే కొద్ది సమయం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మొత్తానికి జక్కన్న ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే సుమను బొక్కలో వేసి కూడా పబ్లిసిటీ పొందాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Read: