News and Entertainment

అరుదైన పక్షి... పార్వతీదేవి ప్రతిరూపంగా ప్రచారం...


చూడటానికి అది పక్షో, జంతువో తెలియదు కానీ.. దాని పేరు హికు. చాలా అరుదుగా కనిపించే వింత ప్రాణి. దాన్ని చూస్తే అంతా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉందని చెబుతున్నారు పండితులు. ఇది ఎక్కువగా నేపాల్‌లో కనిపిస్తుంది. నాలుగు కాళ్లతో.. నక్క లాంటి శరీరం, శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, పొడవైన తోక, రెండు కొమ్ములు ఉన్నాయి. నడుం భాగం బాగా సన్నగా ఉంటుంది.
ఈ పక్షి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పార్వతీదేవి దానికి అరటిపళ్లు తినిపించేదని, ఆమె ఆ వింత ప్రాణిని పక్షి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పక్షికి హికు అనే పేరు కూడా పార్వతీదేవి పెట్టిందని పండితులు చెబుతున్నారు. హికును ఎవరూ చంపలేరని శివుడు వరం ఇచ్చాడని సోషల్ మీడియా సందేశాలు పోస్ట్ అవుతున్నాయి. ఈ పక్షి ఫొటోతో పాటు కామెంట్స్ కూడా విచిత్రంగా ఉన్నాయి.


ఇది పక్షినా.. జంతువునా అని పక్కనపెడితే.. ఆకారం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. చలికాలంలో మాత్రమే నేపాల్ లోని హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తోంది. హికు పక్షి చల్లటి ప్రాంతాల్లోనే బతుకుతుంది. ఇలా చెబుతున్నదాంట్లో నిజానిజాల సంగతి ఎవరికీ తెలియదు గానీ, చూడటానికి మాత్రం ఈ పక్షి చాలా చిత్రంగా కనిపిస్తోంది.
చాలా చాలా అరుదుగా ఉన్న ఈ ఆకారం కూడా చర్చనీయాంశం అవుతుంది. హికు పక్షికి చావులేదా.. దాన్ని ఎవరూ చంపలేరా అనే ప్రశ్నలకు మాత్రం.. జంతు శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు.