దేవుడి గురించే కాదు, ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలియకున్నా అలాంటి వారే గొప్ప సన్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించబడతారట. ప్రజలు, నాయకులు, బడాబాబులు, ధనవంతులు వారిన పూజిస్తారట.
విపరీతమైన చలి, గాలులు, ఎండ, వర్షాలు, మంచు వంటి ప్రకృతి భీభత్సాలే కాక మనుషులు గొడవలు, ఆకలి, దాహం, వ్యాధులు వంటి కారణాల వల్ల ఎక్కువగా నశిస్తారట.
స్త్రీ, పురుషులు ఇద్దరూ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయడం ప్రారంభిస్తారట. వ్యాపారాలు చేసే వారికి మోసపూరితమైన బుద్ధి బాగా పెరిగిపోతుందట. కేవలం జంధ్యం వేసుకుంటే చాలు, అలాంటి వారిని బ్రాహ్మణులని అంటారట.
మనుషుల మధ్య తారతమ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయట. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతాయట. పక్క వారే కాదు..
సొంత బంధువులు, కుటుంబ సభ్యులే చిన్న గొడవలకే ఒకర్ని ఒకరు చంపుకుంటారట.
ధనవంతులుగా పుట్టిన వారికే ఎక్కువ మర్యాద దక్కుతుందట. పేద వాడికి న్యాయం జరగదట. డబ్బున వారిదే శక్తిగా, వారు ఆడిందే ఆటగా మారుతుందట.
మనుషులు తమ పెద్దవారిని, తల్లిదండ్రులను అస్సలు గౌరవించరట. వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తారట.
కలియుగంలో కలి ప్రభావం వల్ల మతం, నిజాయితీ, నీతి, శుభ్రత, సహనం, ఓర్పు, దయ, జీవిత ప్రమాణ కాలం, శారీరక శక్తి, జ్ఞాపకశక్తి వంటివన్నీ రోజు రోజుకీ తగ్గిపోతాయట. చివరకి మనిషి పతనమవుతాడట.
దొంగలదే సామ్రాజ్యం అవుతుందట. వారు అన్ని ప్రదేశాలను పంచుకుంటారట. రాజకీయ నాయకుల్లో అవినీతి పెచ్చరిల్లుతుందట. వారు ప్రజలను ఏ మాత్రం పట్టించుకోరట. వారు కేవలం బాబాజీలను మాత్రమే నమ్ముతారట.
ఎవరు ఏ మతానికి చెందుతారో తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా గుర్తులు, చిహ్నాలు ధరించాల్సి వస్తుందట. మనిషి తన జీవితం గడవడం కోసం ధనం సంపాదించడం కష్టతరమవుతుందట. బాగా మేథస్సు ఉన్నవారు గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారట.