బర్త్ డే.. ! పుట్టిన రోజు అంటే అందరికీ ప్రత్యేకమే. ఆ రోజుని చాలా సరదాగా, తమకు
నచ్చిన విధంగా, ఇష్టమైనవాళ్లతో గడపాలని భావిస్తారు. రోజంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా..
హ్యాపీగా గడిపేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో నెలలో పుట్టినట్టే..
వాళ్ల మనస్తత్వాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయట. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో పుట్టిన
నెలను బట్టి వాళ్ల పర్సనాలిటీ తెలుసుకోవచ్చని చెబుతోంది.
జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో మీరు ఏ నెలలో పుట్టారు ? అనే విషయం తెలిస్తే
చాలు.. వారి ప్రవర్తనా విధానం ఎలా ఉంటుందో కనిపెట్టవచ్చు. మీ పర్సనాలిటీ మ్యాచ్ అయిందో
లేదో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా ? అయితే మీ వ్యక్తిత్వంతోపాటు.. మీరు ఇష్టపడే స్నేహితుల
వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసే ఛాన్స్ మీ చేతుల్లో ఉంది. ఈ ఆసక్తికర విషయం తెలుసుకుని..
మీ ఫ్రెండ్స్ ముందు.. జ్యోతిష్యులైపోండి..
జనవరి
మీరు జనవరిలో పుట్టినవాళ్లు అయితే.. మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీరు
కన్న కలల్ని నిజం చేసుకుంటారు. అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది. అలాగే ఎక్కడైనా
జయించగలుగుతారు.


