కొత్త బంగారు లోకంతో తెలుగు ప్రేక్షకులకు
దగ్గరైన బెంగాలీ భామ శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, తర్వాత ఆ కేసు నుండి బయటపడటం జరిగింది. శ్వేతాబసు ప్రసాద్ ఉన్న హోటల్ మీద
పోలీసుల రైడింగ్, కోర్టులో శ్వేతకు క్లీన్ చిట్ మీద ఆమె ఓ
క్లారిటీ ఇచ్చేసింది. సినిమా అవకాశాల కోసం తప్పుడు దారిపట్టిన అమ్మాయిగా శ్వేతను
మీడియాలో చిత్రీకరించారు. అయితే అసలు నిజలు ఏంటో తనకే తెలుసునని.. ఆ రోజు ఏం
జరిగిందో శ్వేతాబసు ప్రసాద్ వివరించింది.
ఆ రోజు సినీవార పత్రిక సంతోషం ప్రకటించే
అవార్డుల కోసం హైదరాబాద్ వచ్చానని.. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ముంబైకి తిరుగు
ప్రయాణమయ్యానని.. కానీ తాను వెళ్లాల్సిన విమానం క్యాన్సల్ అయిందని ఆమె తెలిపింది.
దాంతో తిరిగి తన హోటల్ రూంకు వచ్చిన తర్వాత ఆమె ఉంటున్న రూంపై పోలీసులు దాడి చేసినట్లు
ఆమె తెలిపింది. మొత్తానికి అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పోలీసులు
అరెస్టు చేశారని, తర్వాత ఏం జరిగిందో అందరికి
తెలుసునని అన్నారు. మొత్తానికి తాజాగా హిందీలో సీరియల్స్ తో అమ్మడు బాగానే బిజీగా
ఉంది. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, హిందీలో ఏక్తాకపూర్
నిర్మాతగా చేస్తున్న చంద్రనందిని సీరియల్ లో రాకుమారి పాత్ర చేస్తున్నట్లు శ్వేత
వెల్లడించింది.

