భూమ్మీద ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ
చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది, బహుశా మీరు
ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతే కాదు కనీసం వినడం కూడా జరిగి
ఉండదనుకోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకతేమిటి అనుకుంటున్నారా? ఐతే
తెలుసుకోండి ఇక్కడున్న శివలింగం కదులుతోందండి! ఏంటీ ? కదిలే
శివలింగమా! భలే చెప్పార్లే ఎక్కడైనా ఇలాంటి కదిలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి
కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. ఈ కదిలే
శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్కు
వెళ్లాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపురం లో ఉన్న
దుగ్దేశ్వరనాథుడు కదులుతాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే.ఈ అలయలోని శివలింగం పానమట్టము
మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న
ఈ అతిపురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ ఆలయం యొక్క
శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతూ ఉంటుంది, అలా ఒక గంట
కదలవచ్చు, లేదా ఐదు గంటలు కదలోచ్చు, ఒక్కోసారి
ఇరవయి నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు. ఇలాంటి
సమయంలో ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని చూడడానికి
వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయ్యాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం
కూడా కదలదంట. అందుకే ఈ వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు ఈ
కదిలేశివలింగ ఆలయంలోకి, ఈ లింగం ఇంకా భూమి లోపలకి ఎంత లోతు
వరకు ఉందొ తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలంయ్యరంతా.
. .
స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది
ఓం నమః శివాయ

