అప్పుడప్పుడు
బాగా అలిసిపోయినట్టు అనీజీగా ఫీలవుతున్నారా? అంతే కాకుండా తలనొప్పి,కడుపునొప్పి
వంటి సమస్యలతో బాధ పడుతున్నారా? దీనికి కారణం మీ శరీరం
విషపూరితం కావడమే. అయితే మీ శరీరం విషపూరితం కావడానికి కారణాలేంటి? వాటిని ఎలా తగ్గించుకోవాలి....ఇప్పుడు చూద్దాం.
తలనొప్పి
రొటీన్ లైఫ్ కు అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల కోపం,చికాకు,విసుగు
వస్తుంది. అయితే ఆ తలనొప్పి మైగ్రైన్ ఎప్పుడూ కాకపోవచ్చు. ఈ తలనొప్పికి కారణం
మోనోసోడియం గ్లుటమేట్(ఎంఎస్‌జి),ఆస్పర్‌టైం అనే విషపూరిత
పదార్దాలు. ఎంఎస్‌జి కాన్సర్ కారకం కూడా. విషపూరిత పదార్దాలైన రంగులు లోహపూరిత
పదార్దాలు మన ఆహారంలో కలవడం వల్ల కూడా మనకు ఈ తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
మగత
నిద్రలా అప్పుడప్పుడు అనిపిస్తుందా? కొన్ని సార్లు రాత్రి బాగా నిద్రపోయినప్పటికీ ఇలా
అనిపిస్తుంది. మీ శరీరంలోని విషపూరితాలను తొలగించడనికి మీ శరీరం ఎక్కువ కష్టబడుతుంది.
దానివల్ల అడ్రనల్ గ్రంధులపై ఒత్తిడి పెరుగుతుంది. విషపూరితాలు ఎక్కువైనకొద్ది ఆ
గ్రంధి పై ఒత్తిడీ మరింత పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే ఎక్సర్‌సైజ్ చేసి
శరీరాన్ని మరింత అలిసిపోయేటు చేయడమే. నిద్రలేమి కూడా శరీరంలో విషపదార్దాల వలనే.
దీంతో కర్టిసోల్ అనే హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. దీని
మోతాదు పెరిగితే నిద్రలేమి వస్తుంది. కార్టిసోల్ హర్మోన్ ఎప్పుడూ అలిసిపోయారో
ఎప్పుడు నిద్రపోవాలో సూచిస్తుంది. దీని మోతదు ఉదయం పూట తక్కువగా ఉండి రాత్రవుతున్న
కొద్దీ పెరుగుతుంది. అయితే ఈ హార్మోన్ తగిన మోతాదులో లేకపోతే మనం వర్క్
చేస్తున్నప్పుడు నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది.
మలబద్దకం
శరీరంలో
విషపూరిత పదార్దాలు తయారైతే మరో ముఖ్య సమస్య మలబద్దకం. శరీరంలో విషపదర్దాలు
ఎక్కువైతే కిడ్నీ ,లివర్ చేసే పనులకు ఆటంకం కలిగి మలబద్దకానికి హేతువవుతుంది. దీంతో పాటు
తలనొప్పి ఇతర నొప్పులకు కారణమవుతుంది. విషపూరిత హర్మోన్ల వలన కండరాల నొప్పి ఆయాసం
వస్తుంది. ఏ విధమైన పని చేయకుండనే కండరాల నొప్పులు,శరీరం
గాయపడినట్టు అవుతుంది. మరికొన్ని విషపదార్దాలు కండరాలలో భాదను కలిగించి నొప్పులు
వచ్చేలా చేస్తాయి. ఈ విషపూరిత పదార్దాలు పేరుకుపోవడం వలన స్లో పాయిజన్ గా
పనిచేస్తుంది, నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేస్తుంది. దీన్ని
మొదటి దశలోనే కనిపెట్టగలిగితే తగ్గించుకోవచ్చు.
చర్మ
సంబందిత వ్యాధులు,
అలర్జీలు ఈ టాక్సిన్స్ వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ టాక్సిన్స్ ను
కాలేయం పోగొడుతుంది. అయితే వీటి మోతాదు పెరిగితే లివర్ కు చర్మం వీటిని
పోగొట్టడంలో సహాయపడుతుంది. ఈ టాక్సిన్స్ రక్తంలో ఎక్కువైతే తామర, సోరియాసిస్ వ్యాధులకు కారణమవుతుంది.
శరీరం
నుంచి దుర్వాసన రావడం కూడా ఈ టాక్సిన్ పనే. మీ శరీరం, మూత్రం,మలం
చెడు వసన వస్తుందంటే మీ శరీరంలో ఈ టాక్సిన్స్ పెరిగి లివర్ పూర్తిగా పనిచేయదం
లేదని అర్దం.
వీటిని
తొలగించుకోవడానికి కింది ఆరోగ్య సూత్రాలను పాటించండి.
*
పళ్ళు,కూరగయల్ను
టీ ఎక్కువగా తీసుకొండి. వీటి వలన టాక్సిన్స్ శరీరం నుంచి తొలగించవచ్చు. ప్రకృతి
సిద్దమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన టాక్సిన్స్ తొలగించవచ్చు.
*
నీటిని వీలయినంత ఎక్కువగా తాగండి. దీని వలన శరీరంలోని టాక్సిన్స్ తొలగించవచ్చు.
*
రోజుకు 30 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేస్తే రక్త సరఫరా మెరుగవతుంది.
*
బ్రీత్ ఎక్సర్‌సైజ్ చేయడం వలన శరీరానికి వీలయినంత ఎక్కువ ఒక్సిజన్ అందుతుంది. దీని
వలన కూడా టాక్సిన్స్ తొలగించుకోవచ్చు.