News and Entertainment

కిడ్నీలో రాళ్ళున్నాయా? అయితే రోలర్ కోస్టర్ ఎక్కేయండి. తర్వాత ఏమవుతుందో తెలుసా?


మీ కిడ్నీలో రాళ్లున్నాయా ? అయితే రోలర్ కోస్టర్ ఎక్కేయండి. మీ  కిడ్నీలో ఉన్న రాళ్లు ఇట్టే కరిగిపోయి మూత్రం ద్వారా బయటికొచ్చేస్తాయట. ఈ మాటలన్నది ఎవరో కాదు  సాక్షాత్తు ప్రముఖ యూరాలజికల్ సర్జన్ డేవిడ్ వర్తింగ్. దీని మీద చిన్నపాటి ప్రయోగం చేసి మరీ ఈ విషయం నిజమేనని రూఢీ చేశాడీయన.  సాధారణంగా ప్రతి ఒక్కరి కిడ్నీలో చిన్నచిన్న రాళ్లు అనేకం ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా బయటికి పోతాయి. కానీ పెద్ద పరిమాణంలోని రాళ్లు మూత్రపిండాల్లో అలాగే ఉండి నొప్పితో పాటు అనేక వ్యాధులకు కారణం అవుతాయి.

డేవిడ్ వర్తింగ్ చేసిన ప్రయోగం:

కిడ్నీలో మూడు రాళ్లు ఉన్న ఓ వ్యక్తిని  రోలర్ కోస్టర్ లో కూర్చోబెట్టి….. ఓ రైడ్ చేయించాడు. ఇంతకు ముందు అతని కిడ్నీలో ఉన్న రాళ్ల సైజ్ ను రైడ్ తర్వాత కిడ్నీలోని స్టోన్స్ సైజ్ ను పోల్చి చూశాడు. మొదటి సారితో పోల్చితే రైడ్ తర్వాత కిడ్నీలలోని స్టోన్స్ సైజ్ తగ్గింది. అంతే కాకుండానార్మల్ టైమ్ లో మూత్రం ద్వారా రాళ్లు బయటికి వెళ్లే వేగం 16 శాతం ఉంటే రోలర్ కోస్టర్ లో ఓ రైడ్ తర్వాత వాటి వేగం 63 శాతంగా నమోదైంది.

  • కాబట్టి ఇప్పుడిప్పుడే కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు, మీడియమ్ పరిణామంలో కిడ్నీలో రాళ్లు ఉన్నవారు 6 నెలలకోసారైనా.. మీడియమ్ డెన్సిటీ ( పరిమిత వేగం, పరిమిత మలుపులు) గల రోలర్ కోస్టర్ రైడ్ చేయడం ఉత్తమం.
  • 20-30 సంవత్సరాల లోపు ఉన్న వారికే ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి….వాళ్లు రోలర్ కోస్టర్ రైడ్ చేయడం ఉత్తమం.
  • గుండె జబ్బు ఉన్నవారు, ధైర్యం తక్కువ ఉన్నవారు, ఆయాసం ఎక్కువగా ఉన్నవారు. దీని జోలికి పోవొద్దు.