మూత్రం.. మన శరీరంలోని రక్తంలో ఉండే పలు వ్యర్థ పదార్థాల
మిశ్రమం. దాన్నంతటినీ మూత్రం రూపంలో కిడ్నీలు వడబోస్తాయి. అలా విడుదలైన
మూత్రం మూత్రాశయంలోకి చేరుతుంది. అక్కడ మూత్రం నిండుతుందనగానే మెదడు
మూత్రానికి వెళ్లాలని సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో మనం మూత్రానికి వెళ్తాం.
అయితే మూత్ర విసర్జన విషయానికి వస్తే పురుషులు, స్త్రీలు భిన్న
రకాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే పురుషులు నిలబడి
చేస్తారు. కొందరు పురుషులు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు. అది వేరే
విషయం. కానీ మీకు తెలుసా..? పురుషులు నిలబడి కాక, కూర్చుని మూత్ర విసర్జన చేస్తే ఎంతో ఉపయోగం. అవును, మీరు విన్నది నిజమే.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది
కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు. ఈ క్రమంలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో
చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు. అనేక మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు
లేవు. కూర్చునే మూత్ర విసర్జన చేస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
- కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి ఎంతో
శుభ్రతను అందించినట్టు అవుతుంది.
- మూత్రాశయ, సెక్స్ సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే
దాంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.
- కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మూత్రాశయం నుంచి మూత్రం
పూర్తిగా బయటకు వస్తుంది. ఇది కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి
ఎంతో మేలు చేస్తుంది.

