తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని ధీరుడు ఎస్
ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి మొదలు
పెట్టిన ఆయన జైత్ర యాత్ర గత సంవత్సరం బాహుబలి చిత్రం వరకు ఏ ఒక్క సినిమా అపజయం
కాలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలకు మంచి లైఫ్ ఇచ్చిన రాజమౌళి ఇద్దరు ముగ్గురు హీరోలత తప్ప అందరితో
తీశారు. అయితే రాజమౌళి ఇప్పటి వరకు పవర్
స్టార్ పవన్ కళ్యాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాలు
తీయలేదు. గతంలో పవన్ కళ్యాన్ తో సినిమా
తీయడం అంత సులభం కాదని చెప్పిన రాజమౌళి మహేష్ బాబు తో ఓ మంచి సినిమా తీయాలనే
అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం.
అంతే కాదు ‘బాహుబలి’ తరువాత రాజమౌళి
కి వేరే సినిమా కమిట్ మెంట్ ఉన్నప్పటికీ మహేష్ బాబు తో ఓ సినిమా తీయాలనే ప్లాన్ లో
ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మేరకు నిర్మాత కె.యల్.నారాయణకి
రాజమౌళి డైరెక్షన్
లో మహేష్ తో ఒక సినిమా చేయడానికి
అగ్రిమెంట్ ఉందట. ఇక బాహుబలి 2
చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళికి రెండు కమిట్ మెంట్లు ఉన్నాయట..ఒకటి దానయ్యతో
మరొకటి కె.యల్.నారాయణ.
ఇక మహేష్ బాబు, రాజమౌళి
కాంబినేషన్ చిత్రంపై అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్ లో
వచ్చే సినిమాపై అప్పుడే అంచనాలు మొదలైతున్నాయి. ఏది ఏమైనా దర్శకధీరుడు రాజమౌళి,
సూపర్ స్టార్ కాంబినేషన్ అంటేనే హిట్ టాక్ వినిపిస్తుంది.

