థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ…పృథ్వీ పై
బంజారాహిల్స్ PS లో వేధింపులు, చీటింగ్
ల కింద కేసు నమోదైంది. కవిత అనే వివాహిత పృథ్వీపై
ఈ మేరకు పొలీసులకు పిర్యాదు
చేేసింది. అయితే కవిత అనే మహిళతో పృథ్వీ
సహజీవనం చేస్తున్నాడట.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కవితకు ఇంతకు ముందే వివాహమైనప్పటికీ… భర్తతో విడాకులు తీసుకొని
హైద్రాబాద్ కు వచ్చేసిందట, తెలిసిన వారి సహాయంతో పృథ్వీ కార్యాలయంలో ఉద్యోగంలో చేరిందట. అలా
పృథ్వీ తో పరిచయం ఏర్పడిందట.. ఆ పరిచయమే
ప్రేమ గా మారి కవితతోనే సహజీవనం
చేస్తున్నాడట పృథ్వీ….అయితే ఈ మధ్యకాలంలో మరో మహిళతో పృథ్వీ
క్లోజ్ గా ఉండడాన్ని చూసిన కవిత పృథ్వీని నిలదీయడంతో వారిద్దరి మధ్య గొడవ
జరిగిందట.
ఇదిలా ఉండగా గత నెల 21 న.బంజారాహిల్స్ PS కు వెళ్లిన కవిత..పృథ్వీ తనను మానసికంగా, శారీరకంగా
వేధిస్తున్నాడని కేసు పెట్టింది. తన దగ్గరున్న 2 లక్షల రూపాయలను, బంగారాన్ని కూడా తీసుకెళ్లాడని
సదరు మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. 420,498A
సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

