2016లో ఇప్పటివరకు సుమారు 150 కి
పైగా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యుంటాయి. మరో 50 సినిమాలకు పైగా వచ్చే నెలల్లో
రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాంటిది ఏడాది ముగియకముందే ఎవరైనా అవార్డులు
ప్రకటిస్తారా చెప్పండి…కానీ ఓ అవార్డు సంస్థ మాత్రం 2016 కి గాను తెలుగు సినిమా విజేతను
కూడా ముందే నిర్ణయించేసింది.
2016కి గాను టాలీవుడ్ బిగ్గెస్ట్
హిట్ గా నిలిచిన సినిమాగా తొలి అర్ధభాగంలో సరైనోడు 75.60 కోట్లతో ఉండగా తరువాత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ 85 కోట్లకు చేరువ అవుతూ దాదాపు 10 కోట్ల
లీడింగ్ తో టాప్ ప్లేస్ కొట్టేసింది.
కాగా ప్రతీ ఇయర్ కి ఓ సారి ఇయర్ బిగ్గెస్ట్
హిట్స్ కి అవార్డులు ఇచ్చే “ఇంటర్నేషనల్ ఫిల్మ్ బిజినెస్అవార్డ్స్(IFBA)” వారు తెలుగుకి గాను ఈ ఇయర్ లో సరైనోడు సినిమాకు
బిగ్గెస్ట్ గ్రాసర్ గా అవార్డు ఇచ్చారు.
అదేంటి జనతాగ్యారేజ్ బిగ్గెస్ట్
హిట్ అయితే సరైనోడుకి ఇవ్వడం ఏంటని అడిగితె….మేము సెలెక్ట్ చేసే సమయానికి సరైనోడు టాప్ లో ఉండటంతో
ఆ సినిమాకే ఇచ్చాము అని వారు చెబుతున్నారని సమాచారం. దాంతో ఈ అవార్డుకు ఎంత
ప్రాధాన్యత ఉందొ తెలియదు కానీ ఇలా ఒక సినిమాకు ఇవ్వాల్సిన అవార్డు మరో సినిమాకు
ఇవ్వడం తప్పని అందరూ విమర్శిస్తున్నారు…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా
సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ గట్టిగానే ఖండిస్తున్నారు.

