షాప్ ఓపినింగ్స్‌కు వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్‌కు
ముఖ్యంగా లేడీ సెలబ్రిటీస్‌కు చేదు అనుభవాలు ఎదురవుతాయ్.. ఆకతాయిల అల్లరిచేష్టలకు
చాలా మంది హీరోయిన్స్ బలైపోయారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చి
చేరింది. ఓ షాప్ ఓపినింగ్‌కి వెళ్ళిన సమంతతో దారుణంగా ప్రవర్తించాడు ఓ ఆకతాయి
అభిమాని. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగింది.
వీ కేర్ సంస్థ తన 32వ శాఖను మధురైలో
నెలకొల్పింది. దీని ప్రారంభోత్సవానికి సమంతను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. పర్సనల్
బాడీ గార్డ్స్‌తో ఎంటర్ అయిన సమంత, కార్ దిగగానే
అభిమానులు ఆమెను చుట్టుముట్టారు.. ఆ గుంపులోంచి ఓ ఆకతాయి వచ్చి సమంత ప్రైవేట్
పార్ట్‌ని గట్టిగా టచ్ చేయటంతో ఆమె కేకలు పెట్టారు. సమంత పరిస్థితి చూసి
కంగారు పడ్డ యాజమాన్యం ఆమెను అతికష్టం మీద సంస్థ యొక్క మూడవ ఫ్లోర్లో ఓ గదిలో
దాచి ఉంచారు. సంస్థ నిర్వాహకులపై ఆగ్రహించిన అభిమానులు సమంతని కదలనివ్వకుండా
చేయాలానే ఉద్దేశంతో ఆమె కార్ టైర్ పంక్చర్ చేశారు. ఇక చేసేదేమీలేక పోలీసులకు
ఫిర్యాదు చేయటంతో పోలీస్ సిబ్బంది అల్లరిమూకను చెదరకొట్టి సమంతని సేఫ్‌గా
పంపించారు.

