నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమి పుత్ర
శాతకర్ణి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్సకత్వం
వహిస్తున్న ఈ సినిమాను చారిత్రిక నేపధ్యంలో భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. బాలివుడ్
నటి హేమమాలిని వంటి అగ్ర తారలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే
101 వ సినిమాకు బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. సృజనాత్మ దర్శకుడు కృష్ణ వంశీ
దర్శకత్వంలో రైతు పేరుతొ ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్
చేయాలని ఇటీవలే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్‌ను కూడా బాలయ్య కలిసిన
విషయం తెలిసిందే.
బాలయ్య కోరిక మేరకు ఈ సినిమాలో నటించేందుకు బిగ్‌బీ
అమితాబ్ అంగీకరించారు. ఈ సినిమా కోసం 17 రోజుల కాల్షీట్లను కూడా ఇచ్చేశారు. అయితే
ఈ సినిమాలో అమితాబ్ చెయ్యబోయే పాత్ర ఏంటి అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో అమితాబ్ రాష్ట్రపతి పాత్రలో
కనిపించనున్నారని సమాచారం. ఫిబ్రవరిలో 17 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో బిగ్‌బీ
పాల్గొననున్నారు. ఇటీవల మోదీ ప్రభుత్వం.. బిగ్‌బీ అమితాబ్‌ను రాష్ట్రపతి పదవిలో
కూర్చోబెట్టాలనుకుంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి రియల్ లైఫ్‌లో బిగ్‌బీ
రాష్ట్రపతి అవుతారో లేదో తెలియదు గాని.. రీల్ లైఫ్‌లో మాత్రం రాష్ట్రపతి
అయిపోతున్నారన్నమాట.

