News and Entertainment

బాహుబలి అక్టోబర్‌ 5 సిక్రెట్‌ రివీల్‌


తాజాగా ‘బాహుబలి 2’ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన జక్కన్న రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసిన విషయం తెల్సిందే. అదే సమయంలో అక్టోబర్‌ 5న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెళ్లడి చేస్తాను అని, అది ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ హ్యాపీని కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. దాంతో ఫ్యాన్స్‌ అంతా కూడా అక్టోబర్‌ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ విషయం ఏంటా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తికర విషయం అక్టోబర్‌ 5 రాకుండానే రివీల్‌ అయ్యింది. సిక్రెట్‌గా ఉంచాలని భావించిన విషయం రివీల్‌ అయినట్లుగా జక్కన్న కూడా ప్రకటించాడు.


ఇంతకు ఆ సీక్రెట్‌ ఏంటి అంటే.. ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్‌ స్టార్‌ అయిన ప్రభాస్‌ ప్రతిమను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ మ్యూజియం సిబ్బంది తాజాగా వచ్చి ప్రభాస్‌ కొలతలు మరియు ఛాయా చిత్రాలు తీసుకు వెళ్లారు. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయుడు మరియు సౌత్‌ ఇండియా నుండి మొదటి వ్యక్తి కావడం ఇక్కడ చెప్పుకోద్దగ్గ విషయం. ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్‌కు ఆయన సన్నిహితుల నుండి అభినందనలు వెళ్లడి అవుతున్నాయి. బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్‌ ప్రతిమను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.