ఈ వివాదానికి కారణమైన రెపోర్టర్ పేరు జాఫర్.. మీడియా వర్గాల్లో ఈ పేరు తెలియని వారుండరు. టి.వి.9 వేదికగా కొనసాగుతున్న ముఖాముఖి ప్రోగ్రామ్‌కు వచ్చిన గెస్టులను ముక్కుసూటి ప్రశ్నలతో ఇబ్బందిపెట్టే ఈ స్టార్ రిపోర్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు టార్గెట్‌గా మారాడు. ఆ మధ్య బ్లూఫిల్మ్ ప్రశ్నతో రోజాకి షాక్ ఇచ్చిన జాఫర్, తర్వాత సునీల్ తో కూడా చీవాట్లు తిన్నాడు. అప్పట్నుండి ఇప్పటి వరకూ తన ముక్కుసూటి ధోరణిని మరింత పెంచుకుంటూ వచ్చాడు.
ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన జనతాగ్యారేజ్పై విరుచుకుపడుతు ట్విట్టర్లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. లక్ష్మీ సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ చేసిన టైగర్ కామెడినీ తారక్ జనతాగ్యారేజ్ రికార్డులకు సింక్ చేస్తూ ఊహించని విధంగా పోస్ట్ చేశాడు. ఈ వీడియో ద్వారా జనాలకు చెప్పిన నీతి ఏంటంటే, ఫేక్ కలక్షన్స్ రిపోర్ట్స్‌తో రికార్డులను బద్దలుకొడుతున్న తారక్ అనే విధంగా పోస్ట్ ఉండటంతో జాఫర్‌పై విరుచుకుపడ్డారు ఎన్టీఆర్ ఆభిమానులు. అయితే ఇది తను చేసిన తప్పు కాదని, తన ఎకౌంట్‌ను హ్యాక్ చేసి ఎవరో ఇలా చేశారని, ఈ విషయం ట్విట్టర్‌కు కంప్లైంట్ చేశానని జాఫర్ పేర్కొనటం గమనార్హం.
Tiger secret behind #JanathaGarage collections. pic.twitter.com/w6RiKCKCC9— Sir Jaffar (@JaffarTV9) September 24, 2016
loading...

