పతంజలి పేరుతో ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి దించిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఫక్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్పటి వరకు ఆయన 800 రకాల ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు.
ఇప్పటి వరకు పేస్ట్, పొడులు వంటి సరుకులను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఆయన ఇప్పుడు దుస్తుల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ దుస్తుల వ్యాపారంలో జీన్స్ సహా అన్ని రకాల వస్త్రాలను దేశీయంగా తయారు చేయించి మార్కెట్ చేసేందుకు రెడీ అయింది. ఈ ప్రొడక్ట్స్‌ను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలోకి సైతం విస్తరించనున్నారు. ఈ ఉత్పత్తుల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా అనువైన వస్త్రాలను తయారు చేయనున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక, జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు.
దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. వీటిని లుథియానలో తయారు చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పతంజలి మార్కెట్ విస్తరణపై ఆయన మాట్లాడుతూ తాము ఇప్పటికే నేపాల్ మార్కెట్లో ప్రవేశించామని… బంగ్లాదేశ్, ఆఫ్రికా మార్కెట్లపై కూడా దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. స్టేజ్2 అనంతరం యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు.
షేర్ చేయండి- తన తండ్రి కామపైశాచికత్వాన్ని బయటపెట్టిన ఓ అభాగ్య కూతురు
- కొరటాల శివ బోయపాటి శ్రీను ని తిట్టడానికి కారణం ఇదే
- ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా.
loading...

