పూరి జగన్నాథ్.. తిట్టులో హీరోయిజాన్ని
పండించడంలో దిట్టమైన డైరెక్టర్‌గా
పేరుతెచ్చుకున్నాడు. ఇడియట్, పోకిరి,
దేశముదురు, లోఫర్ చిత్రాలతో ఆ పదాలకే ఒక వన్నె
తెచ్చాడు. ఈ చిత్రాలే పూరి పలు విజయవంతమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందించాడు. అయితే,
తన తొలిచిత్రం హీరో పవన్ కల్యాణ్ మాట వినుంటే తాను ఈ పరిస్థితిలో
ఉండేవాణ్ని కాదేమోనని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. తొలి సినిమా బద్రి కోసం పవన్‌ను
కలవాలనుందని శ్యామ్ కె నాయుడు సోదరుడు చోటా కె నాయుడిన అడిగాడట పూరి. అయితే, ముందు తనకు కథ చెప్పాలని నచ్చితేనే పవన్ దగ్గరికి పంపిస్తానన్నాడట చోటా.
దీంతో తాను అనుకున్న కథ కాకుండా ఇట్లు
శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పడం, అది చోటాకు
నచ్చడం పూరిని పవన్ దగ్గరికి పంపించడం జరిగిపోయింది. అక్కడ కూడా కథ చెప్పాక
క్లైమాక్స్ మార్చాలని సూచించాడట పవన్. ఆలోచిస్తానని వెనక్కి వెళ్లిన పూరి తిరిగి
అదే క్లైమాక్స్‌తో
వచ్చి మార్చే ప్రసక్తే లేదని చెప్పడంతో.. ‘నువ్వు
నిజంగా క్లైమాక్స్ మార్చి ఉంటే అవకాశం ఇచ్చే వాణ్ని కాదు’ అని పవన్ చెప్పాడట. అలా బద్రితో అవకాశం రావడం తాను ఇప్పుడు ఈ స్థాయిలో
ఉండడానికి కారణం నాడు పవన్ సలహాను పాటించకపోవడమేనని పూరి చెప్పుకొచ్చాడు. నేడు
పూరి జగన్నాథ్ పుట్టినరోజు.

