ఇంటర్నెట్ ఓ గొప్ప కమ్యూనికేషన్ సాధనం. ఈ అతిపెద్ద సమాచార వ్యవస్థలో మంచికి ఎంత చోటు ఉందో, చెడుకు అంతే చోటు ఉంది. ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుని నేరాలకు పాల్పడే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.
ఇంటర్నెట్ ద్వారా నేరాలకు పాల్పడే సైబర్
నేరస్తులకు సెంటిమెంట్లు ఉండవు. జీవితాలతో ఆడుకోవటమే వాళ్లకు తెలుసు. సైబర్
నేరగాళ్లు ఇంటర్నెట్ వ్యసవ్థను చీడపట్టిస్తూ ప్రపంచ భద్రతనే ప్రమాదంలోకి
నెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఆర్థిక, వ్యక్తిగత ఇంకా భద్రతాపరమైన నేరాలను సైబర్ క్రైమ్స్ అని అంటారు. నెటిజనులు
వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫేస్బుక్
అకౌంట్లో
మన ఫేస్బుక్
అకౌంట్లో
రకరకాల లింక్స్ పోస్ట్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో స్కామర్లు తమ కొత్త ఎత్తుగడలో భాగంగా
సోషల్ మీడియా లింక్స్‌లో
వైరస్‌ను
జొప్పించి ఫేస్బుక్
అకౌంట్లలో
పోస్ట్ చేస్తున్నారు. వీటిని క్లిక్ చేసినట్లయితే వైరస్ మీ అకౌంట్‌ను
పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
loading...


