శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూశారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. కేరళ చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లిన త్రిస్సూర్ (తిరుశివపెరూర్)లో ఉన్న వడక్కునాథన్ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు. పురాతన, చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ ఆలయం అనేక కళలకు నిలయం. పురాతన ఆలయం అని చెబుతున్నారు కదా, మరి శివలింగం ఉండకపోవడమేమిటి? అనుకోకండి. ఇక్కడ శివలింగం ఉంది!
కానీ వందల సంవత్సరాలుగా ఈ శివలింగానికి నెయ్యితో అభిషేకాలు చేసీ చేసీ అది ఒక గుట్టలా పేరుకుపోయిందని అంటారు. దాదాపు అయిదారు మీటర్ల ఎత్తున్న నెయ్యిగుట్ట కింద శివలింగం కప్పబడిపోయిందట. ఆ నెయ్యి కాస్తా గడ్డకట్టుకుపోయింది. అది మండే ఎండల్లోనూ కరగదు, వాసననూ వెదజల్లదు. అదీ సంగతి! ఏడాదిలోపు పిల్లలను ఈ ఆలయంలోకి అనుమతించరు. లోపలికి ప్రవేశించాలంటే సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. మహాశివరాత్రి పర్వదినాన లక్ష దీపాల అలంకరణతో తేజోవంతంగా భాసిల్లుతూ భక్తులకు కనువిందు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటేనేమో!
- గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా గడపాలంటే ఈ మూడింటిని వదిలేయాలి
- మీ రాశి ప్రకారం మీ అంతరాత్మ ఏం చెబుతుంది
- గత జన్మలో ఎలా ఉన్నారు.. వచ్చే జన్మలో ఎలా ఉంటారు
- వినాయకుని నిమర్జనం లో విఘ్నేశ్వరుని ఆవేదన- తప్పక చదివి షేర్ చెయ్యండి
- అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
- సాయిబాబా మరణం గురించి మీకు తెలియని విషయలు
- అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్
- శివలింగాన్ని ఈ వస్తువులతో అసలు పూజించకూడదట
- 18 మంది స్త్రీలకు ఆపరేషన్ అని చెప్పి మత్తుమందు ఇచ్చి ఆ డాక్టర్ ఏం చేసాడంటే
- బ్రేకింగ్ న్యూస్ : రిలయన్స్ Jio ఇంటర్నెట్ ఆఫర్స్ డిటేల్స్ అఫీషియల్ అనౌన్స్
- వైరల్ ఫీవర్ ను దూరం చేసే టాప్ 3 నేచురల్ మెడిసిన్స్
- ఈ ‘వీడియో’ను ధైర్యవంతులు మాత్రమే చూడండి
- పబ్లిక్ లో అమ్మాయి జీన్స్ విప్పమన్న బిజెపి ఎంపి...! (వీడియో)
- హస్తప్రయోగం వల్ల పొందే 8 అద్భుత ఆరోగ్యప్రయోజనాలు
- చనిపోయిన వారిని బ్రతికించే సంజీవిని మొక్క వనపర్తి గుట్టల్లో
loading...

