News and Entertainment

శ్రీమంతుడు సీఎం కానున్నాడా?


‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలతో హ్యాట్రిక్‌ను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ తన తర్వాత సినిమాను మహేష్‌బాబుతో చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న మహేష్‌బాబు ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చాడు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి కాంబోలో మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతుంది. కొరటాల తన గత మూడు చిత్రాల్లో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్‌ను కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.


కొరటాల తన తర్వాత సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్‌బాబును పొలిటీషియన్‌గా దర్శకుడు కొరటాల చూపించబోతున్నాడు. మహేష్‌బాబు గతంలో ‘దూకుడు’ చిత్రంలో రాజకీయ నాయకుడిగా కనిపించిన విషయం తెల్సిందే. కనిపించిన కొన్ని నిమిషాలు అయినా కూడా మహేష్‌బాబు ఆకట్టుకున్నాడు. ఇక కొరటాల శివ పూర్తి స్థాయిలో మహేష్‌బాబును రాజకీయ నాయకుడిగా చూపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం సూపర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.


loading...