కొత్తిమీర 3 కట్టలు, 1 కిలో నిమ్మకాయలు, 5 లీటర్ల నీళ్లు, కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకోవాలి. ఆర్గానిక్ పద్ధతిలో పండిన నిమ్మకాయలైతే బెటర్. లేదంటే సాధారణ నిమ్మకాయలకు క్రిమి సంహారక మందులు పట్టి ఉంటాయి. కాబట్టి వీటిని తొలగించాలంటే నిమ్మకాయలను బేకింగ్ సోడా, నీరు మిశ్రమంలో వేసి 5 నిమిషాల పాటు బాగా కడగాల్సి ఉంటుంది. అనంతరం నీటిని తీసుకుని బాగా మరిగించి చల్లార్చాలి. కొత్తిమీర, నిమ్మకాయలను తీసుకుని వాటిని చిన్న చిన్న పీస్‌లుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ పట్టాలి. ఆ జ్యూస్‌ను మరగబెట్టిన నీటికి కలిపి వడపోయాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని బాటిల్‌లో పోసి నిల్వ చేసుకోవాలి. ఆ బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 24 గంటల తరువాత నుంచి ఆ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. నిత్యం 1 గ్లాస్ చొప్పున ఈ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా కనీసం 2 వారాలు చేయాలి. మొదటి వారంలోనే మీరు ఆశ్చర్యకర ఫలితాలను గమనిస్తారు.
పైన చెప్పిన మిశ్రమాన్ని 2 వారాల పాటు తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంటనే కరిగిపోతుంది. దీంతో గుండె పదిలంగా ఉంటుంది. రక్త నాళాలు చక్కగా పనిచేస్తాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది. జలుబు, జ్వరం ఉన్న వారు ఈ మిశ్రమాన్ని తాగితే వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో ఉన్న విష పదార్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. ఇప్పటికే గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు, సమస్యలు రావద్దనుకునే వారు ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
అందరికీ షేర్ చెయండి
loading...