తాజాగా ఈయన ఒక వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఇంటర్వ్యూ ఇంకా రావాల్సి ఉంది.
ఆ ఇంటర్వ్యూలో గీతా కృష్ణ మాట్లాడుతూ... మహేష్‌బాబు ఇటీవల నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఒక సీరియల్లా అనిపించింది, అలాంటి సినిమా మహేష్‌బాబు ఎందుకు చేశాడో అర్థం కాలేదు అని అన్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్‌లు తన ముందు బచ్చాగాళ్లు అని, వారు తన కళ్ల ముందు ఎదిగారు అని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు.
ఈయన ఆ ఇంటర్వ్యూలో మరిన్ని షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా అనిపిస్తోంది. అయితే గీతాకృష్ణ కామెంట్స్ పబ్లిసిటీ కోసం అని సెలబ్రెటీలను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందనే దురుద్దేశ్యంతో ఆయన ఇలా పవన్, ఎన్టీఆర్‌లను విమర్శిస్తున్నాడు అని ఆయా హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.
షేర్ చెయండి
loading...

