” ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన 120 కోట్ల జనాభా ఉన్న దేశం, ఆ మెడల్స్ కోసం సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎంత సిగ్గు చేటు. ” ఇదీ ఇంగ్లీష్ జర్నలిస్ట్, టీవీ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ ఇండియా గురించి చేసిన వ్యాఖ్య. ఇన్నాళ్లూ ఇండియాలో కొంత మంది జనాలు అంటున్న ఈ మాట మోర్గాన్ చెవి వరకూ వెళ్లినట్టుంది.. డైరెక్ట్ గా ట్వీట్ చేసేశాడు. భారతీయుడికి దేశం గురించి ఏమైనా మాట్లాడే హక్కుంది. కానీ మన దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం మాత్రం నిస్సందేహంగా మోర్గాన్ చేసిన తప్పే. దీనిపై ఇప్పటికే ట్విట్టర్లో మోర్గాన్ ను మనోళ్లు ఆడేసుకోవడం మొదలెట్టేశారు. అయితే అందరి కౌంటర్లలోకీ సెహ్వాగ్ వేసిన డైలాగ్ పీక్స్ అని చెప్పాలి.
” భారతీయులం ప్రతీ చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతాం. అది పక్కన పెడితే, క్రికెట్ ను కనిపెట్టిన ఇంగ్లాండ్ పాపం ఇప్పటికొచ్చి ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. అయినా ఇంకా క్రికెట్ ఆడుతోంది. ఎంత సిగ్గు చేటు ” అని కామెంట్ చేశాడు వీరూ. తన మీద జోకులేసినా పట్టించుకోడు గానీ, ఇండియాను ఎవరైనా ఎమైనా అన్నారంటే వెంటనే సెహ్వాగ్ మార్క్ పంచ్ పడాల్సిందే. సెహ్వాగ్ దెబ్బ, ఇంగ్లీషోడి అబ్బ అంటూ సెహ్వాగ్ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
loading...

