15 – 10 – 1918 మధ్యాహ్నం 2.30కి సాయి బాబా పరమ పదం పొందారు
షిర్డీ సాయిబాబా (మరణం : అక్టోబరు 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువు లు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు.
సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు.