కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ అగ్ర నిర్మాత కేఎస్ రామారావు నిర్మాణంలో, రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ కథ విపరీతంగా నచ్చడంతో కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్‌లు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర సమాచారం తెలుస్తోంది. తొలత ఈ మల్టీస్టారర్ సబ్జెక్ట్ ను రవికుమార్ చౌదరి జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో చేయాలని భావించారట. అయితే, వీరిద్దరు ఈ సబ్జెక్ట్ విని ఏమాత్రం ఆసక్తి చూపించలేదట. ఇంచుమించు ఒకే సమయంలో రవికుమార్ చౌదరి, కేఎస్ రామారావులు వీరిద్దరిని అప్రోచ్ అయ్యారట.
కథ సంగతి ప్రక్కనబెడితే.. బన్నీ కాంబినేషన్లో సినిమా అనగానే, కష్టమని ఎన్టీఆర్ తేల్చేయగా.. జూ. ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనగానే బన్నీ కూడా కుదరదని చెప్పేశాడట. దీంతో, ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్‌ల దగ్గరకి వెళ్లిందని తెలుస్తోంది. మొత్తానికి, టాలీవుడ్లో ఓ సూపర్బ్ మల్టీస్టారర్ మిస్ అయ్యింది. టాలీవుడ్ లో సూపర్బ్ డ్యాన్సర్స్ అయిన వీరిద్దరూ ఈ సినిమా ఒప్పుకుని ఉంటే, సిల్వర్ స్క్రీన్ వీరిద్దరి అదిరిపోయే డ్యాన్స్‌లతో షేక్ అయ్యేది! ఇద్దరి అద్భుతమైన డ్యాన్సులను వెండితెరపై ఒకేసారి చూసే అదృష్టం ప్రేక్షకులకు కలిగి ఉండేది.
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి
మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
loading...