శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఎక్కువగా లక్ష్మీ దేవిని పూజిస్తారు. అధిక శాతం మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయడం వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా..? శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివునికి కూడా పూజలు చేయవచ్చు. దీంతో భక్తులకు అంతా శుభమే కలుగుతుంది. ఈ క్రమంలో శివున్ని వేటితో పూజించాలి, వేటితో పూజించకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
1. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు.
2. ఒకప్పుడు తులసి భర్త అయిన శంఖాసురుడనే రాక్షసున్ని శివుడు సంహరించాడట. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్పటి నుంచి తులసి ఆకులతో శివున్ని పూజించడం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. ఒక వేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే కలుగుతాయట. కాబట్టి శివున్ని తులసి ఆకులతో పూజించడం మానుకోండి.
loading...


