స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు సాధారణంగా లిథియం-అయాన్‌తో తయారైనవే ఉంటాయి. అయితే సైంటిస్టులు చెబుతున్నదేంటంటే మనం ఎక్కువగా శ్రమ పడితే ఎలా ఒత్తిడికి లోనవుతామో, అదేవిధంగా బ్యాటరీకి ఎక్కువ సేపు అంటే 100 శాతం చార్జింగ్ అయినా ఇంకా అలా చార్జింగ్ పెట్టే ఉంచితే అందులోని లిథియం-అయాన్ ఒత్తిడికి లోనవుతుందట. ఈ క్రమంలో కొంత కాలానికి అది సరిగ్గా పనిచేయదట. దీంతో బ్యాటరీ సమస్యలు వస్తాయట. కాబట్టి 100 శాతం కావడానికి ఒకటి, రెండు పాయింట్ల ముందే చార్జింగ్ తీసేయాలట. దీంతో బ్యాటరీ ఎక్కువ రోజులు వస్తుందట.
అయితే బ్యాటరీలో పవర్ 10 శాతం తగ్గగానే చార్జింగ్ పెట్టవచ్చట. అదేవిధంగా 10 శాతం మిగిలి ఉందన్నప్పుడు కూడా ఫోన్‌ను వాడకుండా చార్జింగ్ పెట్టడమే బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోన్‌ను కేవలం ఒకేసారి కాకుండా చార్జింగ్ తగ్గినప్పుడల్లా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చార్జింగ్ పెట్టవచ్చట. దీంతో డివైస్‌కు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని వారు చెబుతున్నారు. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందట. ఇక చివరిగా ఇంకో విషయం ఏమిటంటే ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవుతుంటే దానికి ఉన్న బ్యాక్ ప్యానెల్ లేదా ఫ్లిప్ కవర్‌ను తీసేయాలట. దీంతో హీటింగ్ తక్కువవుతుందట. అదేవిధంగా సూర్యకాంతిలో ఉన్నప్పుడు డివైస్‌ను చార్జింగ్ చేయాల్సి వస్తే దానిపై ఏదైనా నీడ ఉండేలా కవర్ చేయడం ఉత్తమమని టెక్ నిపుణులు అంటున్నారు. తెలుసుకున్నారుగా, బ్యాటరీ చార్జింగ్ గురించిన విషయాలను. నచ్చితే పాటించండి. దీంతో మీ ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువ కాలం వస్తుంది. అంతేగా!
నడుము, తొడలు చుట్టూ పేరుకున్న ఫ్యాట్ కరిగించే అల్లం వాటర్ ఎలా చెయ్యలో ఇక్కడ చూడండి
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి
loading...






