అమితాబ్ ను ఆకాశానికెత్తేస్తూ.. పనిలో పనిగా రజినీకాంత్ గాలి తీస్తూ.. తన మీద తాను కూడా సెటైర్ వేసుకున్నాడు."తీన్" సినిమాలో రజినీకంత్ నటించి ఉంటే 1 మార్కు పడేదని.. అదే అమితాబ్ "కబాలి" చేస్తే 100 మార్కులు పడతాయని సెలవిచ్చాడు వర్మ. అంతే కాదు మితాబ్ బచ్చన్ "రోబో"లో నటించి ఉంటే ఇంకా చాలా బాగుండేది అన్నారు. అదే విధంగా రజినీకాంత్ "తీన్" సినిమా చేస్తే తుస్సుమనేదని అభిప్రాయపడ్డాడు వర్మ. తీన్.. బ్లాక్.. పీకూ లాంటి సినిమాల్లో రజినీకాంత్ చేస్తే ప్రేక్షకులు నవ్వుకునే వారని అన్నారు.
భారతీయ సినిమాను ముందుక తీసుకెళ్లడం కోసం అమితాబ్ తన స్టార్ డమ్ వదులుకుని ప్రయోగాలు చేశాడని వర్మ అన్నాడు. అంతే కాదు తెలుగులో చిరంజీవి.. తమిళంలో రజినీకాంత్ లాంటి వాళ్లు అమితాబ్ ను చూసి నేర్చుకుని మాస్ హీరోలుగా ఎదిగారని.. కానీ అమితాబ్ మాత్రం తన పవర్ ఏంటో తాను తెలుసుకోలేకపోయాడని వర్మ అన్నారు. రోయిజం లేని "రణ్" లాంటి సినిమాలు చేయడం అమితాబ్ చేసిన తప్పని వర్మ అన్నాడు.
అక్కడ ముద్దాడితే మహిళలు కామంతో రగిలిపోతారు
loading...

