పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే నిర్మాతలు మేము చేస్తామంటే మేమే చేస్తాం అంటూ క్యూ కడతారు. ఎందకుంటే ఆయనతో సినిమా ఒకవేళ ప్లాపైనా పెద్దగా నష్టం ఉండదు, ఓపెనింగ్స్...ఫస్ట్ వీక్‌లోనే కలెక్షన్లు మాగ్జిమమ్ వచ్చేస్తాయి. సినిమా యావరేజ్ గా నడిస్తే లాభాలు ఖాయం, హిట్టయితే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కాసుల వర్షమే! అయితే పవన్ ఈ మధ్య బయటి నిర్మాతలతో సినిమాలు చేయడం లేదు. తన స్నేహితుడు శరత్ మరార్, తాను కలిసి స్వయంగా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సర్దర్ గబ్బర్ సింగ్ మూవీ తన స్నేహితుడితో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మించారు. తాజాగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలోనూ అంతే. త్వరలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల రెండు కథలను పవన్ కళ్యాన్ వద్దకు పంపగా ఆయనకు బాగా నచ్చాయని తెలుస్తోంది. అయితే కథలు విన్నతర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కు ఓ సూచన చేసినట్లు సమాచారం.
'ఈ రెండు కథలను రామ్ చరణ్ ముందు చెప్పండి...అందులో అతనికి ఏది నచ్చితే ఆ సినిమాను నేనే నిర్మిస్తాను. మరో స్టోరీలో నేను నటిస్తాను' అని త్రివిక్రమ్ కు సూచించినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా అఫీషియల్ గా ప్రకటన వస్తే తప్ప ఇందులో నిజం ఎంతో తేలనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో హిట్టయిన 'థాని ఒరువన్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తయితే గానీ పవన్-చరణ్ కాంబినేషన్లో సినిమాపై ఓ క్లారిటీ రానుంది.
loading...

