దీనితో ‘అ ఆ’ తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్మాత దిల్ రాజ్ తన నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అని ప్రకటించిన నేపధ్యంలో రకరకాల ఊహాగానాలు మరియు రకరకాల కాంబినేషన్స్ తెర పైకి వచ్చాయి.
ఈ గందరగోళ పరిస్థితిని పసిగట్టిన త్రివిక్రమ్ తన సన్నిహితుడు రాధాకృష్ణను రంగంలోకి దింపి పవన్ కు రాధాకృష్ణ ద్వారా అడ్వాన్స్ పంపడంతో ఈ గేమ్ కు త్రివిక్రమ్ చెక్ పెట్టాడు అనుకోవాలి. ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కు రెండు కథలు వినిపించిన నేపధ్యంలో ఆ రెండిటిలో ఎదో ఒకటి ఫైనల్ అవుతుంది అని అంటున్నారు.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సూపర్ ఫ్లాప్ తరువాత కూడ ఈసినిమాకు సంబంధించి పవన్ కు 20 కోట్లకు పైగా భారీ పారితోషికం ఫిక్స్ అయినట్లు టాక్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ‘అ ఆ’ లను నిర్మించిన రాధాకృష్ణ జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిస్టరీని రిపీట్ చేయడానికి పవన్ త్రివిక్రమ్ లతో చేస్తున్న ఈప్రయత్నం బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించడం ఖాయం..
loading...

