ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నదియా ప్రస్తుతం తన 40వ పడిలో కూడ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే హుందా తనంతో కూడిన లుక్ తో ప్రస్తుతం తెలుగు సినిమా రంగానికి ఖరీదైన అత్తగా తల్లిగా మారింది. నిన్న విడుదలైన ‘అ ఆ’ సినిమాను ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రమోట్ చేస్తూ పవన్ ప్రభాస్ లపై ఆమె ఆ సక్తికర కామెంట్స్ చేసింది.
మొదటిగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ వండరఫుల్ ఫాబ్యులస్ కో-స్టార్ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది నదియా. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ లాంటి వెరీ హంబుల్ పర్సన్ ను తాను ఇంతవరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది.
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ చాల తక్కువగా మాట్లాడుతూ ముభావంగా ఉన్నా షూటింగ్ స్పాట్ లో మాత్రం తన కో-ఆర్టిస్టులకు చాల సహాయం చేస్తాడు అన్న విషయాన్ని బయట పెట్టింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రైల్వే స్టేషన్ లో తీసిన క్లైమాక్స్ సన్నివేశాలు అంత అద్భుతంగా రావడానికి పవన్ కారణం అని అంటూ తమ ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ వల్ల ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి అంటూ పవన్ ఆకాశానికి ఎత్తేసింది నదియా.
నటిగానే కాదు నదియా అమెరికాలో తాను ఉంటున్నప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ చేయడమే కాకుండా యూనివర్సిటీ టాపర్ గా వచ్చిన విషయాన్ని కూడ ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టింది నదియా. తాను 40 సంవత్సరాలు దాటిపోయినా తనను ఇంకా 20 సంవత్సరాలలో ఉన్నట్లుగానే ఆదరించడం తన అదృష్టం అని అంటోంది నదియా.
మరణించిన వారి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా?
పీడ కలల వలన చెడు జరుగుతుందా? ఎందుకో తెలుసా?
loading...

